హైదరాబాద్: డా బిఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్‌లో ఆర్టీసి ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమీక్ష జరిపారు. నూతన బస్సులు, రవాణా, డబుల్ డెక్కర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, సంస్థకు వచ్చిన లాభాలు, వ్యయం, సంస్థలో చేపట్టిన పలు కార్యాచరణ, బస్సుల ఓఆర్, ఉద్యోగుల సంక్షేమం, అందిస్తున్న వైద్య సేవలు తదితర అంశాలకు సంబంధించి సంస్థ ఎండి సజ్జనార్ ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడ గురువారం ఈ సమావేశం నిర్వహించారు.
రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తైన తరుణంలో సాధించిన విజయాలు, రాష్ట్ర రవాణ శాఖ సేవలు, వనరులు, ఆదాయ వృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్ ప్రగతి అంశాలు, కార్యాచరణ ప్రణాళిక గురించి మంత్రి పువ్వాడ అజయ్ అధికారులకు దిశా,నిర్ధేశం చేశారు. ఈ సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాసరాజు, రవాణా శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.