- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
సత్తుపల్లి :పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీకు సమీపంలో రూ.2 కోట్ల 75 లక్షలతో నిర్మించబోతున్న మోడ్రన్ ధోబి ఘాట్, మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు గురువారం సాయంత్రం సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రి నాగేశ్వరరావు స్థలాన్ని సేకరించారని ఆ స్థలం వివాదం కావడంతో రజకులు కోర్టు వివాదంలో గెలవడంతో, దోబీ ఘాట్‌కు ఫంక్షన్ హాల్ మంత్రి కేటీఆర్ ద్వారా నీదురు మంజూరు చేయించామన్నారు. త్వరలోనే షాధీఖానా, కమ్యూనిటీ హాల్, మరికొన్ని సిసి రోడ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వాటిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ద్వారా ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే సత్తుపల్లిలో 100 ఆసుపత్రి కట్టడం పూర్తికావచ్చిందని, పట్నంలోని రాజీవ్ నగర్ కాలనీలో పట్టణ దవాఖానాలు ప్రారంభించామని మనకు కొన్నిటిని ఏర్పాటు చేస్తామన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక సత్తుపల్లి పట్టణం బాన్ర చెందిందని గతంలో పట్టణ రూపురేఖలు ఇప్పుడు రూపురేఖలు ఎ్ర ఉన్నాయో మీ అందరికీ తెలుసునన్నారు. పట్టణం మొత్తం సీసీ రోడ్లతో పూర్తి చేసామని ఈ సందర్భంగా తెలిపారు. సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ తోట సుజాత గణేష్, ఖమ్మం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, కమిషనర్ సుజాత, కౌన్సిలర్స్, బిఆర్‌ఎస్ నాయకులు, చాంద్ పాషా, ఆనందరావు, పెద్దిరెడ్డి పురుషోత్తం, కృష్ణయ్య, రజక సంఘం నాయకులు రాము, చింతల సత్యనారాయణ, శ్రీనివాసరావు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.