Monday, December 23, 2024

వైభవంగా ఊరడమ్మతల్లి గ్రామదేవత ప్రతిష్ఠాపన

- Advertisement -
- Advertisement -
  • ఉత్సవాలలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి: మండల పరిధిలోని మొగిలిగుండ్ల గ్రామంలో గ్రామ దేవత ఊరడమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి మండల నాయకులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొండల్ రెడ్డి ఆలయ నిర్మాణంలో భా గంగా 50 వేల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామ సర్పంచుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు సోహెల్, ఎంపీటీసీల ఫోరమ్ మండలాధ్యక్షుడు రవి, బీఆర్‌ఎస్ మాజీ మండలాధ్యక్షుడు సురేష్‌కుమార్, మండల నాయకులు బట్టు రమేష్, రామేశ్వర్, సురేశ్, పాండురంగారెడ్డి, యాదవ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అనంత్ రెడ్డి, తుక్కయ్య, గౌరయ్య, రవీందర్‌రెడ్డి, శంకర్, వెంకశం, నవీన్, ప్రశాంత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News