Monday, December 23, 2024

క్రీడలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -
- Advertisement -
  • హ్యాండ్‌బాల్ పోటీల్లో విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే రసమయి

బెజ్జంకి: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలను నిర్వహించారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చెర్మన్, మనకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. సిఎం కప్ 2023 సంవత్సరం గాను జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో రెండో స్థానంలో బహుమతి సాధించిన మండల క్రీడాకారులకు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో శాలవతో సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిఎం కప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహించడంలో రాష్ట్ర క్రీడా చరిత్రలోనే నూతన అధ్యాయమన్నారు.

మండలంలో నిర్వహించిన సిఎం కప్ పోటీలకు మంచి స్పందన లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇంచార్జి ఎంపిడిఓ అంజయ్య, ఎంపిఓ విష్ణు, పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నాయకులు లక్ష్మణ్, సోషల్ మీడియా ఇంచార్జి ఎలా శేఖర్ బాబు, అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, గణపురం తిరుపతి, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News