Friday, December 20, 2024

దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి జాతీయ స్థాయిలో ప్రశంసా పురస్కారం

- Advertisement -
- Advertisement -
  • ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్

 దుబ్బాక: సిద్దిపేట జిల్లాలో ఉత్తమ ఆసుపత్రిగా దుబ్బాక ప్రభుత్వాసుపత్రి ని గుర్తించి ప్రశంసా పురస్కారం ఇవ్వడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 20 తేది నాడు జరిగిన కాయకల్ప్ అసెస్మెంట్లో మన గవర్నమెంట్ ఆసుపత్రి మొదటిసారి పాల్గొనడం జరిగిందని , పాల్గొన్న మొదటి సారి మన ఆసుపత్రికి బహుమతి రావడం చాలా గర్వకారణం అన్నారు.

ఈ బహుమతి రావడానికి సహాకారం అందించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చేర్మెన్, కమిటీ సభ్యులకు , ప్రజా ప్రతినిధులకు, మీడియా మిత్రులకు , ఆసుపత్రి సిబ్బంది కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాక ఆసుపత్రిని గుర్తించి కమాండేషన్ బహుమతి కూడా ఇవ్వడం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News