Sunday, December 22, 2024

రాజకీయాలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుందాం

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా నిర్వహించుకుందామని, 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రోజుకో కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, రెవెన్యూ డివిజన్ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అదే విధంగా తెలంగాణ అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్రాముఖ్యత గురించి ఎమ్మెల్యే మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది ప్రాణాలు కోల్పోయారని వారిని స్మరిం చుకుందామన్నారు.

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ తొమ్మిది సంవత్సరాలలో అమలు చేసిన పథకాలను గుర్తు చేశారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 21 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మెన్ సత్యం, ఎంపిపి సామ మనోహర, మార్కెట్ చైర్మెన్ విజయ్ గౌడ్, పిఎసిఎస్ చైర్మెన్ జనార్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News