Friday, November 22, 2024

రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి భారతీయ చిత్రాలు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఒకప్పుడు భారతీయ చలన చిత్రాలు బాక్సాఫీసు వద్ద రూ. 500 కోట్లు సంపాదించడమే ఊహించలేని విషయం. నేడు భారతీయ సినిమాలు రూ. 1000 కోట్ల మార్కును దాటాయి. ఐదేళ్లలో అసాధారణ మార్పు కనబడుతోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా (పాన్ ఇండియా) సినిమాలు బాక్సాఫీసును బద్ధలు కొడుతున్నాయి. దీనికంతటికీ దిగ్గజ సూపర్ స్టార్లే కారణం. ప్రపంచవాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. దాంతో ప్రపంచవాప్తంగా కూడా భారతీయ సినిమాలు తమదైన ప్రభావాన్ని చూపుతున్నాయి. రూ. 1000 కోట్ల క్లబ్‌లో భారతీయ సినిమాలు చేరడానికి బడా సూపర్ స్టార్‌లు కారణం.

1. ప్రభాస్ – బాహుబలి
బాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చింది. దానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల బాక్సాఫీసును బద్ధలు చేసిన ఘనత ప్రభాస్‌దే. బాహుబలి రూ. 1810 కోట్లు గడిచింది.
2. ఆమీర్ – దంగల్
బాహుబలి సినిమా విడుదలైన సంవత్సరంలోనే ఆమీర్ ఖాన్ ‘దంగల్ ’ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా రూ. 1968 కోట్లు గడించింది. ఈ సినిమాలో స్వయంగా ఆమీర్ ఖానే నటించారు. ఆయనే సినిమా తీశారు. ఈ సినిమా ఫోగట్ సోదరీమణులకు సంబంధించిన సినిమా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారు వివిధ పతకాలు సాధించారు. చైనాలో ఈ సినిమా మంచి క్రెడిట్ కొట్టేసింది.
3. ఆర్‌ఆర్‌ఆర్ – జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
దర్శకుడు రాజమౌళి తీసిన చిత్రం ఇది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ విలక్షణంగా నటించారు. ఈ సినిమా చారిత్రక అంశాలను వక్రీకరించి తీసినప్పటికీ గుర్తింపును తెచ్చుకుంది. అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పాత్రలను సినిమాలో చూపారు. కానీ అదీ వక్రీకరించి చూపారు. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కర్ అవార్డును గెలుచుకుని దేశానికి ఖ్యాతి తెచ్చింది. అందునా ఓ తెలుగు సినిమా పాట ఆస్కర్ గెలువడం గొప్పనే చెప్పాలి. ఈ సినిమా 2022లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 1250 కోట్లు వసూలు చేసింది.
4. యశ్ – కెజిఎఫ్: ఛాప్టర్ 2
కన్నడ సూపర్ స్టార్ యశ్ నటించిన కెజిఎఫ్2 కూడా మంచి వసూళ్లు రాబట్టిన చిత్రాల కోవలోకి చేరింది. కెజిఎఫ్ సినిమా కూడా రెండు పార్ట్‌లుగా వచ్చింది. ఈ సినిమా దాదాపు రూ. 1200 కోట్లు గడించింది.
5. షారూఖ్ ఖాన్ – పఠాన్
బాలీవుడ్ బాద్షా నటించిన పఠాన్ విడుదలకు ముందే అనేక వ్యతిరేకతలు ఎదుర్కొంది. కానీ అన్ని అడ్డంకులను అధిగమించి ఈ సినిమా మంచి వసూళ్ళను రాబట్టింది. కొవిడ్ తర్వాత ప్రేక్షకులను పెద్ద సంఖలో ఈ సినిమా థియేటర్‌లోకి వచ్చేలా చేసింది. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రూ. 1050 కోట్లు రాబట్టింది.

RRR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News