Monday, December 23, 2024

జూన్ 9 కల్లా డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌ను అరెస్టు చేయండి: రైతుల అల్టిమేటం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నిరసన చేస్తున్న రెజ్లర్లతో రైతులు కలిశారు. జూన్ 9కల్లా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యుఎఫ్‌ఐ) చీఫ్, బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని అల్టిమేటం ఇచ్చారు. హర్యానాలో ‘ఖాప్ మహాపంచాయత్’ రెజ్లర్ల విషయంలో ఆందోళనకు సంబంధించిన తదుపరి చర్య చేపట్టగలదని రైతులు హెచ్చరించారు. ‘ఒకవేళ జూన్ 9 నాటికి జంతర్ మంతర్ వద్ద బైఠాయింపుకు అనుమతి ఇవ్వకపోతే, ఆందోళన ప్రకటన చేస్తాం’ అని రైతు నాయకులు సమావేశానంతరం హెచ్చరించారు.

వివిధ ఖాప్‌లు, రైతుల సంస్థలకు చెందిన ప్రతినిధులు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ సహా వివిధ ప్రదేశాల నుంచి జాట్ ధర్మశాలకు చేరుకున్నారు. రైతు సంఘాలు ఉత్తర్‌ప్రదేశ్‌లో ‘ఖాప్ మహాపంచాయత్’ నిర్వహించారు. అలాగే పంజాబ్, హర్యానాలో గురువారం నిరసనలు చేపట్టారు. మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించారని ఆరోపణ. ఈ విషయంలో మహిళా రెజ్లర్లకు రైతు సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లు సాక్షి మలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా, సంగీతా ఫోగట్ డిమాండ్ చేస్తున్నారు. రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపుకు మార్చ్ నిర్వహిస్తుండగా పోలీసులు వారిని నిర్బంధించారు. వారి నిరసన ప్రదేశం నుంచి అన్నింటిని తొలగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News