Saturday, November 23, 2024

జిల్లా ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ కృషి చేయాలి

- Advertisement -
- Advertisement -
  • రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్

వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్ హాజరై జిల్లాలో తొమ్మిది సంవత్సరాలలో వికారాబాద్ జిల్లాలో సాధించిన ప్రగతిని జిల్లా ప్రజలకు వివరించారు. తెలంగాణ రాష్టం ఏర్పడినప్పుడు 17 మండలాలు ప్రస్తుతం 20 మండలాలతో పునర్వవస్థీకరీంచారు. జిల్లాలో తాండూర్‌ను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి పాలన అందించడం జరుగుతుందని అన్నారు. వికారాబాద్ జిల్లాలో పరిగి ,కొడంగల్‌ను మున్సిపల్‌గా ఏర్పాటు చేశారు.

వికారాబాద్ జిల్లాలో 143 గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. అందులో 84 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 24 గంటల ఉచిత విద్యత్ అందించడంతోపాటు మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించి సాగునీటి అందించడం ద్వారా రైతులు పంటలు పండిస్తూ వ్యవసాయాన్ని పండుగల చేసుకుంటున్నారు. జిల్లాలో రైతబంధు పథకం ద్వారా రైతులకు రెండు వేల ఆరు వందల ఇరువై రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలలో జమచేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో మరణించిన రైతులకు రెండు వందల పదమూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల బీమా పరిహారం అందిందని అన్నారు.

జిల్లాలో కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ దీనిలో భగంగా రెండు వందల డ్బై ఆరు కోట్ల నాలుగు లక్షల రూపాయలు అందించామని తెలిపారు. అలాగే షాదీ ముబారక్ ద్వారా యాబై రెండు కోట్ల పదహరు లక్షల రూపాయలకు అందించామని తెలిపారు. రూర్బన్ పథకం ద్వారా తాండూర్ మండలంలోని మున్సిపాలిటీ మినహయించి మిగిలిన ఇరవై ఐదు పాత గ్రామ పంచాయతీలలో ముప్పై కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

ఇందులో రూ.20 కోట్లు వివిధ అభివృద్ద్ది పనులను ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతారెడ్డి , అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యేలు ,అనంద్ మహేష్‌రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల, ఎంపిడిఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News