Sunday, November 24, 2024

తెలంగాణ చారిత్రక అవసరమని కెసిఆర్ చెప్పిన మాట నిజమైంది

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ జోన్: తెలంగాణ రాష్ట్ర సాధన ఒక చారిత్రక అవసరం అని నాడు ఉద్యమ నేత కెసిఆర్ చెప్పిన మాట నేడు నిజమని జరుగుతున్న అభివృద్దిని చూస్తే స్పష్టమవుతోందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శా ఖల మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మంత్రి హరీష్ రా వు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎఫ్‌డిసి ఛైర్మన్ వం టేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సు మారు 60మంది వికలాంగులకు మూడు చక్రాల స్కూటీలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఆనాడు విజన్ 20 20 అని తమను ఎద్దేవా చేసిన వారే నేడు మమ్మల్ని పొగడుతున్నారన్నారు. ఇటీవల నిర్వహించిన మహానాడులో చంద్రబాబు తెలంగాణలో బాగా అభివృద్ది చేశార ని, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ది జరగటం లేదని చెప్పారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇప్పుడు ఎన్నిక లు సమీపిస్తున్నాయన్న యావతో హడావడిగా అన్ని పార్టీలు తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు చేస్తున్నాయన్నా రు. తెలంగాణ ఉద్యమంలో పదవీ త్యాగానికి ముందుకు రాకుండా వెన్నుచూపి పారిపోయిన నేతలు ఇప్పుడు తెలంగాణ కోసం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. ఆనాడు రాజీనామా చేయకుం డా మొహం చాటేసిని ఇప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినేడు తాము కూడా వేడుకలు చేస్తామనటం నవ్వుతెప్పిస్తో ందన్నారు. తన ప్రాణాన్ని సహితం వదులుకోవటానికి సిద్దపడి అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదా నా శవయాత్ర అంటూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బయ లు దేరిన మహానేత కేసిఆర్ అన్నారు. కెసిఆర్ ఉద్యమంలో నిజాయితీ, తెలంగాణ సాధించాలన్న సంకల్పబ లం,ప్రజల ఆశీర్వాదం, ఎందరో మహనీయుల త్యాగా లు వెరసి తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందన్నారు.

ఈ స త్యాన్ని ఎవరూ కదనలేరన్నారు. ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందో ఇక్కడి ప్రజలకు తెలుసునని అన్నారు. ప్ర స్తుతం తెలంగాణ రాష్ట్రం ఒక సమర్థుడైన నాయకుని చేతిలో సురక్షితంగా ఉంది కాబట్టే సమ్మిళితమైన అభివృ ద్ది సాధ్యమవుతోందని మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు కాపాడుకుని ఎంతో అభివృద్ది సాధించి న తెలంగాణను మరింత అభివృద్ది సాధించే దిశగా పరుగులు తీయించాలంటే ప్రజలు తిరిగి ఉద్యమ స్పూర్తితో రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించి కెసిఆర్ ను హ్యాట్రిక్ సిఎంగా చేయాలని మంత్రి హరీష్ రావు పి లుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డిసి ఛైర్మన్ ప్రతాపరెడ్డి, ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ ఛై ర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు,మున్సిపల్ కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News