- Advertisement -
హైదరాబాద్:ఒడిశా బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఘటనలో 278 మంది మరణించారు. మరో 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ రైలు ప్రమాదస్థలికి వెళ్లనున్నారు.
ప్రమాద ఘటన సహాయ చర్యలపై ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష జరపనున్నారు. ఘటన స్థలంలో పరిస్థితిని ప్రధాని మోడీ పర్యవేక్షించనున్నారు. ప్రమాద ఘటనలో గాయపడి కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని పరామర్శించనున్నారు.
- Advertisement -