Tuesday, November 26, 2024

అక్కడ ప్రైమరీ స్కూళ్లలో బైబిల్‌పై నిషేధం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అశ్లీలత, హింస ఉన్న కారణంగా హోలీ బైబిల్‌ను ప్రాథమిక పాఠశాలలలో నిషేధిస్తున్నట్లు అమెరికాలోని యుటాకు చెందిన పాఠశాల పాలనా విభాగం ప్రకటించింది. యుటా రాజధాని సాల్ట్ లేక్ సిటీలోని డేవిస్ స్కూలు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిబిసి వెల్లడించింది. పాఠశాల వ్యిర్థుల పాఠ్యాంశాలలో బైబిల్ ఎన్నడూ లేనప్పటికీ తమ స్కూలు లైబ్రరీలో ఉన్న ఏడెనిమిది బైబిల్ కాపీలను ఇప్పటికే తొలగించామని స్కూలు యాజమాన్యం తెలిపింది. అయితే బైబిల్‌లోని ఏ అధ్యాయాలు లేదా పేజీలలో అశ్లీలత, హింస ఉన్నదీ వారు వివరించలేదు.

కింగ్ జేమ్స్ బైబిల్‌లో పిల్లలకు ఉపయోగపడే విలువలేవీ లేవని, కొత్త నిర్వచనం ప్రకారం అది అశ్లీలత కిందకు వస్తుందని ఒక విద్యార్థి తండ్రి 2022 డిసెంబర్‌లో చేసిన ఫిర్యాదు మేరకు డేవిస్ స్కూలు పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత ఏడాది యుటాకు చెందిన రిపబ్లికన్ ప్రభుత్వం విద్యార్థుల పాఠ్యపుస్తకాలలో అశ్లీలత లేదా అసభ్యతతో కూడుకున్న అంశాలపై నిషేధం విధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. 2022 చట్టాన్ని బైబిల్‌లోని అంశాలు అతిక్రమించనప్పటికీ చిన్న పిల్లలు చదవడానికి వీల్లేని అశ్లీలత, హింస అందులో ఉన్నాయని డేవిస్ స్కూలు యాజమాన్యం అభిప్రాయపడింది. అయితే ఉన్నత పాఠశాలల్లో మాత్రం హోలీ బైబిల్‌పై ఎటువంటి నిషేధం లేదు.

లైబ్రరీల నుంచి బైబిల్‌ను తొలగించడం ఇదేమీ కొత్త కాదు. గత ఏడాది టెక్సాస్ స్కూలు పాలనా యంత్రాంగం కూడా తమ లైబ్రరీ షెల్ఫుల నుంచి బైబిల్‌ను తొలగించింది. కొన్ని బైబిల్ పుస్తకాలను నిషేధించాలని ప్రజల నుంచి డిమాండు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తమ స్కూలు లైబ్రరీ నుంచి బైబిల్‌ను తొలగించాలని కన్సాస్‌లోని చాలామంది విద్యార్థులు డిమాండు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News