Friday, December 20, 2024

మెదక్ ఎంసిహెచ్ ఆస్పత్రిలో మంత్రి హరీశ్ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

మెదక్ : బీఆర్‌ఎస్ పార్టీ మెదక్ జిల్లా ఆద్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో కేక్ కట్ చేసి ఎంసిహెచ్‌లో ఉన్న గర్బిణీలకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి ప్రధాత, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నానని ఆమె అన్నారు.

రాబోయే రోజుల్లో కూడా ఇదేవిధంగా తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని మెదక్ నియోజకవర్గ ప్రజల తరపున కోరుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, డాక్టర్ చంద్రశేకర్, డాక్టర్ శివదయాల్, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నాయకులు రాగి అశోక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News