చర్లపల్లి: మహిళా రెజ్జర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బిజెపి ఎంపి బ్రిజ్‌భూషన్ చరణ్‌సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో మహిళా రెజర్లు చేస్తున్న నిరసనకు మద్దతుగా నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో శనివారం ఉప్పల్‌లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మహిళలు చేస్తున్న నిరసనను బిజెపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. మహిళా రెజర్లకు న్యాయం చేయలేని కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఏమి న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో ఎప్పుడు మహిళలకు అండగా ఉంటుందని తెలిపారు. ఎంపిని కఠినంగా శిక్షించి మహిళలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిలుకనగర్ కార్పొరేటర్ బన్నాల గీతప్రవీన్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవియదవ్, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, బిఅర్‌ఎస్ నాయకులు మేకల హన్మంతరెడ్డి, గోపు సదానంద్, గందం నాగేశ్వర్‌రావు, వివిద డివిజన్ల నాయకులు తదితరురలు పాల్గొన్నారు.
బిజెపి ఎంపిని వెంటనే అరెస్టు చేయాలి : మాజీ మేయర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -