Friday, December 20, 2024

పార్టీ కార్యక్రమాలు రద్దు : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఒరిస్సా రైలు ఘటన నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించే అన్ని పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకున్నుట్ల బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొనాల్సిన అని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

రైలు దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని సంతాపం ప్రకటించారు. వరంగల్, మహబూబాబాద్ లో పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా పర్యటించాల్సిన కేంద్ర మంత్రి బిఎల్ వర్మ కార్యక్రమాలను రద్దు చేయడం జరిగింది. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొనే కార్యక్రమాలను రద్దు చేసుకొని ఢిల్లీకి వెళ్లారు. ఆదివారం జరిగే కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ పాల్గొంటారు.రైలు ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వివిధ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నాయకులు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News