Monday, December 23, 2024

దేవాలయాలకు పూర్వ వైభవం: మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిటిడి, ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించి సిఎం కెసిఆర్ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో మంత్రి పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కెసిఆర్ హయాం లోనే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు.

దేవాలయం మొత్తం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుతంగా ఉందని, నిర్మాణ కౌశలం భక్తి పారవశ్యం పొంగి పొరలే విధంగా జరిగిందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తలపెట్టిన కార్యక్రమాలు అన్ని విజయవంతం కావాలని నరసింహ స్వామిని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ప్రజలను మంత్రి కోరారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు మోసాలను ఎండగడదాం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News