నేటి నుంచి సిఎం కెసిఆర్ జిల్లాల పర్యటన
నాలుగు కొత్త కలెక్టరేట్ల ప్రారంభించనున్న సిఎం
నేడు నిర్మల్, 6న నాగర్‌కర్నూల్, 9న మంచిర్యాల
12న గద్వాల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ల ప్రారంభం
హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో’ భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఆదివారం(జూన్ 4) నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌ను సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు. ఈ నెల 6వ తేదీన మంగళవారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని, 9న శుక్రవారం నాడు మంచిర్యాల జిల్లా, 12న సోమవారం నాడు గద్వాల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు.
తెలంగాణ దశాబ్ది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో బిఆర్‌ఎస్ 9 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని వివరిస్తున్నారు.
శాఖల వారీగా 21 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరుగనున్నాయి. తొలిరోజు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి పదేళ్ళ పండుగను సిఎం కెసిఆర్ ప్రారంభించగా, ఈ నెల 22న ప్రతిష్టాత్మంగా నిర్మించిన అమరవీరుల స్మారకస్థూపం ప్రారంభోత్సవంతో దశాబ్ది వేడుకలు ముగియనున్నాయి. అయితే పదేళ్ల పండుగలోనే సిఎం కెసిఆర్ నాలుగు జిల్లాలు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నిర్మల్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, గద్వాల జిల్లాల్లో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌లను శంకుస్థాపనలను చేయనున్నారు. ప్రతీ చోట బహిరంగ సభలు ఏర్పాటు చేసి… తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరించనున్నారు.
Also Read: వ్యవసాయం దండుగ అన్న చోటనే పండుగ అయ్యింది