హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కలిశారు. ఎపి, తెలంగాణ రాజకీయాలపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించనట్టుగా తెలిసింది. 2018లో ఎన్డీఏ నుంచి వైదొలిగాక తొలిసారి అమిత్ షాతో చంద్రబాబు తొలిసారి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు రాత్రి 8 గంటల సమయంలో ఈ భేటీ జరిగింది. 2019 ఎన్నికల తరువాత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో ఒకసారి ప్రధాని మోడీని చంద్రబాబు కలవగా, మరోసారి జీ 20 సన్నాహాక సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడు మరోసారి ప్రధానితో చంద్రబాబు సమావేశమయ్యారు.
తాజాగా చంద్రబాబు అమిత్‌షాతో పాటు జెపి నడ్డాతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధ్యాన్యత సంతరించుకుంది.