Monday, December 23, 2024

నిర్లక్షంతో నిండు ప్రాణాలు బలి 

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: కొందరు డ్రైవర్ల నిర్లక్షం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకున్నారు. చాలామంది కారు డ్రైవర్లు డ్రైవింగ్ చేసుకుంటు వచ్చి రోడ్లపైనే నిలుపుతున్నారు. ఇలా రోడ్లపై నిలుపడమే కాకుండా నిర్లక్షంగా కారు డోర్లు తీస్తున్నారు. దీని వల్ల రోడ్డుపై బైక్‌పై వస్తున్న వారికి తగలడంతో మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపై పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో కూడా అల్వాల్ సమీపంలో భార్యభర్ల కలిసి బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన ఆగిఉన్న టాటా ఏస్ డ్రైవర్ అద్దంలో చూసుకోకుండా ఒక్కసారిగి డోర్ ఓపెన్ చేయడంతో బైక్‌పై వస్తున్న భార్యభర్త బైక్‌కు తగిలింది. దీంతో ఇద్దరు బైక్‌తోపాటు రోడ్డుపై పడిపోయారు. అదేసమయంలో వారి వెనుక నుంచి లారీ వస్తుండడంతో వారిపై నుంచి వెళ్లింది, దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్‌గురయ్యారు. ఒక్కనిమిషం ఏం జరిగిందో తెలియక అమోమయానికి గురయ్యారు. డ్రైవర్ చేసిన పొరపాటుకు అమాయకులై భార్యభర్త బలయ్యారు.

సంఘటన జరిగిన వెంటనే టాటా ఏస్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. తాజాగా ఎల్‌బి నగర్‌కు చెందిన దంపతులు తమ కూతురు ధనలక్ష్మిని తీసుకుని బైక్‌పై వెళ్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న కారు డ్రైవర్ ఒక్కసారిగా కారు డోర్ తెరిచాడు. దీంతో బైక్‌పై వెళ్తున్న వీరికి తగలడంలో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. బాలిక ధనలక్ష్మితల రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్ర గాయాలైంది, స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. రెండు సంఘటనల్లో డ్రైవర్లు నిర్లక్షంగా వ్యవహరించడం వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వాహనదారులు ముందుగా ఫోర్ వీలర్లను రోడ్డుపై ఆపకూడదు, దానిని ఉల్లంఘించడమే కాకుండా నిర్లక్షంగా డోర్లు ఓపెన్ చేస్తుండడంతో రోడ్డుపై వెళ్తున్న వారు బలవుతున్నారు. ఇలా నిర్లక్షంగా వ్యవహరించే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని, వాహనాలను రోడ్లపై నిలుపకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే అమాయకులు ప్రాణాలు కోల్పోరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మిర్రర్‌లో చూసి తీయాలి…
ప్రతి ఫోర్ వీలర్‌కు తప్పనిసరిగా రెండు వైపులా మిర్రర్‌లు ఉంటాయి. వాటిని ఏర్పాటు చేసిందే, వాహనాలను చూసుకుంటూ డ్రైవింగ్ చేయడమే కాకుండా ఆపిన సమయంలో వెనుక నుంచి వచ్చే వారిని మిర్రర్‌లో చూసి డోర్‌ను ఓపెన్ చేయాలి. దీనిని పాటించడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం కలుగదు. కానీ డ్రైవర్లు కార్లను నిలిపి వేయగానే వెనుక నుంచి వచ్చే వారిని మిర్రర్‌లో చూడకుండా ఓపెన్ చేస్తున్నారు. దీంతో అమాయకులు వీరి చేసిన తప్పులకు బలవుతున్నారు. రోడ్డుపై వాహనాలను నిలపడమే నేరం, దానికి తోడు నిర్లక్షంగా వ్యవహరించడం సరికాదు. ఎల్‌బి నగర్, అల్వాల్ సంఘటనల్లో ఇద్దరు డ్రైవర్లు వాహనాలను రోడ్డును ఆనుకుని నిలిపివేస్తున్నారు. దీంతో వీరు డోర్లు తెరిస్తే రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు తగిలే విధంగా ఉంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News