Tuesday, December 24, 2024

రాణి వైవాహిక శిరచ్ఛేదం

- Advertisement -
- Advertisement -

ఆనె బొలీన్ రాజకీయ, మత తిరుగుబాట్లకు, ఇంగ్లండ్ లో క్రైస్తవ మత సంస్కరణలకు ప్రధాన కారణమయ్యారు. ఆమె ఇంగ్లండ్ రాజు ఎనిమిదవ హెన్రీకి రెండవ భార్య. 1533 నుండి 1536 వరకు ఇంగ్లండ్ రాణి.ఆనె బొలీన్ విల్ట్ షైర్ ప్రథమ ప్రభువు థామస్ బొలీన్, ఆయన భార్య ఎలిజబెత్ హొవార్డ్ లకు 1501 (లేదా 1507) లో ఇంగ్లండ్ బ్లికింగ్ హాల్ లో జన్మించారు. నెదర్లాండ్స్, ఫ్రాన్స్ లలో చదువుకున్నారు. ఫ్రాన్స్రాణి మేరీ, ఆమె 15 ఏళ్ల సవతి కూతురు క్లాడ్ లకు గౌరవ సేవకురాలిగా పనిచేశారు. 1522 మొదట్లోతన మేనత్త కొడుకు,ఆర్మండ్ 9వ ప్రభువు,జేమ్స్ బట్లర్ ను పెళ్లి చేసుకోడానికి ఇంగ్లండ్ వచ్చారు.ఆ పెళ్లి కుదరలేదు. తర్వాత 1523 లో నార్తంబర్లండ్ ప్రభువు కొడుకు హెన్రీ పెర్సితో రహస్యంగా నిశ్చితార్థం జరిగింది.

అయితే హెన్రీ పెర్సి తండ్రి ఆ నిశ్చితార్థాన్ని ఒప్పుకోలేదు. ప్రభువులు పనిమనుషులతో పెళ్ళికి అంగీకరిస్తారా? ఆ పెళ్లి చెదిరిపోయింది.ఆ నేపథ్యంలో ఆనె బొలీన్, ఇంగ్లండ్ రాజు ఎనిమిదవ హెన్రీ భార్య ఆరగాన్ క్యాథరిన్ కు గౌరవ సేవకురాలిగా కుదురుకున్నారు. క్యాథరిన్ స్పెయిన్ దేశ పూర్వ రాజకుమారి.
రాజు ఎనిమిదవ హెన్రీ ఇంగ్లండ్ ను 40 ఏళ్లు పాలించారు. ఆయనకు ఆరుగురు భార్యలు. రాచరికానికి మూఢవిశ్వాసాలు, అధికార దర్పంతోడుకలిశాయి. హెన్రీ తన బహుభార్యత్వంతో పేరుపొందారు. అపఖ్యాతి పాలయ్యారు కూడా.ఆయనవిశిష్టమయినక్రైస్తవమత సంస్కరణలు చేపట్టారు. ఆ సంస్కరణలు రాజ్యాన్ని మతం నుండి వేరుచేయలేదు.హెన్రీ తన రెండవ పెళ్లికిఆమోదం తెలుపని మత సంస్థ నుండి రాజ్యాన్నివేరుచేశారు.మరొక సొంత మత సంస్థను స్థాపించారు. తన రాజ్యాన్నిఆ సంస్థకు అనుసంధానించారు.

రాజు హెన్రీ,1526 ఫిబ్రవరి, మార్చి నెలలలోఆనె బొలీన్ ను మోహించడం మొదలుపెట్టాడు. కాని ఆమె హెన్రీ ఆకర్షణలకు లొంగలేదు. వివాహేతర సంబంధానికి అంగీకరించలేదు. ఒక పరిచారిక రాజుతో అక్రమసంబంధాన్ని తిప్పికొట్టడం ఆమె గొప్ప వ్యక్తిత్వానికి గుర్తు.రాజు హెన్రీ,రాణి క్యాథెరిన్ పనిమనిషి ప్రేమలో పడడం ఇంగ్లండ్ చరిత్రను మలుపుతిప్పింది. 1533 జనవరి 25 న క్యాథలిక్ చర్చ్‌అధినేత ఏడవ పోప్ క్లిమెంట్,హెన్రీ క్యాథెరిన్ల వివాహరద్దును, హెన్రీ బొలీన్ ల పెళ్ళిని తిరస్కరించారు.ఐరోపాలోనే అత్యంత బలవంతుడయిన రోమన్ చక్రవర్తి ఐదవ చార్లెస్ కు క్యాథెరిన్ అత్త కావడం ఇందుకు కారణం. అంతేగాని ఈ విడాకుల తిరస్కరణలో ఏ సంస్కరణ,సంస్కారం లేవు.

పైపెచ్చు ఒక పరిచారికను రాణిని చేయడం మతానికి ఇష్టం లేదు. పాశ్చాత్య సమాజంలో విడాకులు,మారు పెళ్ళిళ్ళు సాధారణమే అయినా ఒక పనిమనిషితో రాజు పెళ్ళిని మతం ఆమోదించలేదు. అయితే దీనికి కోపగించుకున్న రాజు హెన్రీ, పోప్ తో సంబంధాలను తెంచుకున్నాడు. ఇష్టమయిన మహిళతో పెళ్లి కోసం పాత మత సంస్థతో విడిపడ్డాడు.మత మఠాలను రద్దుచేశాడు. వాటి భూములను, ఆస్తులను రాజ్యం స్వాధీనపరుచుకుంది. ఆవిధంగా హెన్రీ ఇంగ్లండ్ సమాజ నిర్మాణ రూపురేఖలను మార్చాడు. కాని మత బంధాన్ని కొనసాగిస్తూ కొత్త మత సంస్థ, స్వతంత్ర ఇంగ్లండ్ చర్చిని స్థాపించాడు.ఆనెను 01.06.1533 న పెళ్లి చేసుకున్నాడు. క్యాథెరిన్ తో హెన్రీ వివాహ రద్దు ఇంగ్లండ్, రోమ్ సామ్రాజ్యాల మధ్య విభేదాలకు దారితీసింది.

అయితే ఆనె బొలీన్ తో రాజు ఆరవ హెన్రీ సాధించుకున్న వివాహం చాలా కాలం కొనసాగలేదు. ఆనె కూతురును కన్నారు. ఆ కూతురే భవిష్యత్తులో మొదటి ఎలిజబెత్ రాణి అయ్యారు. ఆనె కు ఆ తర్వాత వరుసగా మూడు సార్లు గర్భస్రావం అయింది. కాని రాచరికానికి అర్హత గల కొడుకును మాత్రం ఆనె కనలేకపోయారు. దీనితో రాజు హెన్రీ చాలా అసంతృప్తిచెందాడు. మూడేళ్ళ లోపే మరొక మహిళ జేన్ సీమర్‌ను ప్రేమించడం మొదలుపెట్టాడు. చర్చిని ధిక్కరించి పెళ్ళాడిన ప్రియమయిన భార్యను, రాజ్యాధికార వారసుడయిన కొడుకు కోసం,వదలడానికి సిద్ధపడ్డాడు. అంతటితో ఆ క్రూర ఛాందసకథ ఆగలేదు. ఆనె ను వదిలించుకోడానికి సాకులను వెదికాడు.

ఆనె బొలీన్ ఆమె సోదరుడు జార్జ్, లార్డ్ రోచ్ ఫోర్డ్‌లపై వ్యభిచారం, అక్రమ సంబంధాల నిందలు మోపాడు. ఘోర రాజద్రోహ నేరంపై రాణి ఆనె బొలీన్ ను 1536 మేలో అరెస్టు చేశారు. అహంకార అధికారం స్వార్థానికి ఏమయినా చేయగలదు. అదే నేడూ సాగుతోంది. న్యాయ పీఠంలో ఆనె పూర్వ ప్రేమికుడు హెన్రీ పెర్సి,ఆమె మేనమామ థామస్ హొవార్డ్ ఆనె కేసులో న్యాయమూర్తులు.తనపై లైంగిక వేధింపుల అభియోగ విచారణ న్యాయపీఠానికిమన ప్రధాన న్యాయమూర్తి రంజాన్ గొగోయ్ అధ్యత వహించినట్లు. నాలుగు రోజుల మొక్కుబడివిచారణలోనిందలు రుజువయ్యాయి.

17.05.1536 న నలుగురు అభాండిత ఆనెప్రేమికుల తలలు నరికారు.ఇంగ్లండ్ లో లండన్ టవర్ వద్ద 19.05.1536 న ఆనె తల నరికి ఉరిశిక్షను అమలుచేశారు. అధికారం సాధించిన శిక్షల అమలులో ఆలస్యం ఉండదు. ఆ మరుసటి రోజే జేన్ సీమర్ తోఎనిమిదవ హెన్రీ నిశ్చితార్థం, తర్వాత పెళ్లి జరిగాయి. జేన్ సీమర్ ఇంగ్లండ్ భవిష్యత్తు రాజు ఆరవ ఎడ్వర్డ్ కుజన్మనిచ్చారు. హెన్రీ తన ఐదవ భార్య క్యాథెరిన్ హొవార్డ్‌ను కూడా వ్యభిచార నేరంపై ఉరితీయించారు. ప్రాచీనపాశ్చాత్య సమాజంలోకూడా స్త్రీలపాతివ్రత్య ‘అపవిత్రత’ అభియోగకారణం కావడం విడ్డూరం. హత్యలతో అనేక పెళ్ళిళ్ళతో అపఖ్యాతి పాలయిన హెన్రీనౌకాదళంలో ఓడల సంఖ్యను 5 నుండి 50కి పెంచారు. రాయల్ నౌకాదళ పితామహునిగా పేరుగాంచారు. నేటి భారత సమాజంలోమతోన్మాద హత్యలకు పాల్పడి, ప్రజలను మతపరంగా చీల్చిన పాలకులు పౌరులను మత ఛాందస భ్రమలలో ముంచి పబ్బం గడుపుకుంటున్నారు.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News