Monday, December 23, 2024

వెబ్‌సైట్‌లో గ్రూప్-1 హాల్‌టికెట్లు

- Advertisement -
- Advertisement -

వెబ్‌సైట్‌లో గ్రూప్1 హాల్‌టికెట్లు
నేటి నుంచి 11 వరకు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 11వ తేదీన తిరిగి నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆదివారం(జూన్ 4) కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. ఈ నెల 11వ తేదీ వరకు హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, అప్పటివరకు అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

అత్యధికంగా 503 గ్రూప్ 1 ఉద్యోగాల కోసం వచ్చే ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. గతేడాది అక్టోబర్ 16న నిర్వహించిన పరీక్ష రద్దయిన కారణంగా ఆ హాల్ టికెట్లు చెల్లవని, అభ్యర్థులు మళ్లీ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా త్వరగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News