రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సిఎం ప్రత్యేక దృష్టి
తొమ్మిదేళ్లలో పోలీస్ శాఖకు రూ.59,200కోట్లు కేటాయింపు
పోలీస్ స్టేషన్ల భవనాలకు రూ.775 కోట్లు మంజూరు
ఆధునిక సాంకేతిక పరికరాలు, వాహనాలు అందజేత
పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు, రాష్ట్రంలోని అన్ని పిఎస్‌లతో అనుసంధానం
రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా కొత్త నియామకాలు
మహిళల భద్రతకు 331షీటీమ్స్ ఏర్పాటు
మన తెలంగాణ/సిటీబ్యూరో: ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ పోలీస్ శాఖకు మహర్దశ కలిగింది. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో తీసుకున్న చర్యలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు భారీగా కేటాయింపులు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్ప టి నుంచి తొమ్మిదేళ్లలో పోలీస్ శాఖకు భారీగా నిధులు కేటాయించింది. ప్రత్యేక రాష్ట్ర ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసు శాఖ ఆదివారం సురక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వివిధ విభాగాల్లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయి.
అదే విధంగా పోలీస్ శాఖను ఆధునీకరించేందుకు అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసింది, పోలీసులకు వాహనాలను సమకూర్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో మొదటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను హైదరాబాద్‌లో నిర్మించారు. బంజారాహిల్స్‌లో ఏ ర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెం టర్‌లో లక్ష కెమెరాల ఫుటేజీని పరిశీలించే ఆధునిక పరికరాలు అమర్చారు. అలాగే క్రైట్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టంను ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసిజెఎస్)ను అనుసంధానించిన మొద టి రాష్ట్రం తెలంగాణ. శాంతిభద్రతల పర్యవేక్షణలో కీలక పాత్ర పో షిస్తోన్న సిసి కెమెరాల ఏర్పాటులో పోలీసులు చాలామంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10, 66, 792 సిసి కెమెరాలు ఏ ర్పాటు చేశారు. ప్రతి వెయ్యిమందికి 30 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో హైదరాబాద్ దేశంలోనే అత్యధిక సిసికెమెరాలు కలిగిన నగరంగా మొదటి స్థానంలో నిలవగా, ప్రపంచంలో 16వ స్థానంలో నిలిచింది.
తగ్గిన నేరాలు…
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేరాలు సంఖ్య గణనీయంగా తగ్గాయి. మర్డర్లు 32.94 శా తం తగ్గాయి, మహిళలపై జరిగే నేరా ల్లో 40 శాతం వరకు తగ్గాయి, వరకట్న సంబంధింత నేరాలు గణనీయంగా తగ్గాయి. శాంతిభద్రతల ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్తగా 11 పోలీస్ స్టేషన్లను, 7కమిషనరేట్ల నుఏర్పాటు చేశారు. సైబర్ నేరాలు, నార్కోటిక్ నియంత్ర ణ కో సంసైబర్‌సేఫ్టీబ్యూరో టిఎస్ నార్కోటిక్స్ బ్యూ రో,టిఎస్ కమాండ్ కంట్రోల్ సెంటరలో ఏర్పాటు చేశా రు.వీటికిబాస్‌లుగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్రను నియమించారు.
మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మహిళలు, యువతులు, బాలికల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ముఖ్యమంత్రి కెసిఆర్ దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నా రు.బాధితులు ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేసేందుకు షీటీ మ్స్, భరోసా, షీ భరోసా, సైబర్ ల్యాబ్, మాన వ అక్రమ రవాణా నివారణకు ప్రత్యేకంగా విభాగాలను ఏర్పాటు చే శారు. ప్రతి ఏడాది ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్‌ను నిర్వహించి చిన్నారుల జీవితాల్లో వెలుగు లు నింపుతున్నారు. షీటీమ్స్‌లో ఫిర్యాదు చేసిన బాధితులకుపోలీసులు సమస్య పరిష్కరించిన్యాయంచేస్తున్నారు. మహిళల భద్రతకు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 331 షీటీ మ్స్ చురుగ్గా పనిచేస్తున్నాయి. గృహహింస, బాలలపై లైంగిక వేధింపుల బాధితులకు కౌన్సెలింగ్ చేసి బతుకు మీద భరోసా కల్పిస్తున్నారు.
భారీగా మౌలిక సదుపాయాల కల్పన
సిఎం కెసిఆర్ పోలీస్ శాఖకు ఆధునిక హంగులు కల్పించేందుకు భారీగా కేటాయింపులు చేశారు. తొమ్మిదేళ్లలో రూ.775 కోట్లతో 551 కొత్త పోలీస్ స్టేషన్ల భవనాలను ఏర్పాటు చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 16,154 వాహనాలను సమకూర్చరారు. వాహనాలను కొనుగోలు చేసి పోలీసులకు అప్పగించారు. రెండు 3 టైర్ డేటా సెం టర్లు, స్టేట్ లెవల్ ఇంటిగ్రేటెడ్ క మాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, డిస్ట్రిక్ట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు, డిస్ట్రిక్ట్ సైబర్ ల్యాబ్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఆధునిక పరికరాలు అందజేశారు. వీటితోపాటు టెక్నాలజీ యాప్ లు, లాజిస్టిక్స్,కిట్ ఆర్టికల్స్, బెల్ ఆఫ్‌ఆర్మ్, పోలీస్ ఎస్టేట్‌లు, ఫ్లీట్ మేనేజ్‌మెంట్‌పై పర్యవేక్షణ కోసం 5ప్రత్యే వెబ్ ఆధారిత ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ అప్లికేషన్లు ప్రారంభించారు.