Friday, November 22, 2024

ఆస్పత్రిలో భార్యను పరామర్శించిన సిసోడియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఆప్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఎల్‌ఎన్‌జె ఆస్పత్రిలో ఆమెను చేర్చారు. భార్యను చూడడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతిపై సిసోడియా జైలు నుంచి ఇంటికి ఆయనను పోలీస్ అధికారులు శనివారం ఉదయం తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమ ఆస్పత్రిలో చేరడంతో అక్కడకు అధికారులు సిసోడియాను తీసుకెళ్లగా తన భార్యను, కుటుంబ సభ్యులను సిసోడియా కలుసుకున్నారు. సిసోడియా తన భార్యను చూసేందుకు ఢిల్లీ కోర్టు శుక్రవారం అనుమతించింది.

శనివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య ఆయనను ఇంటికి తీసుకెళ్లాలని తీహార్ జైలు ఎస్‌పి న్యాయమూర్తి ఆదేశించారు. దీనికి ముందు తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోర్టును సిసోడియా కోరగా, కోర్టు అందుకు నిరాకరించింది. అయితే భార్యను చూడడానికి ఇంటికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించింది. ఆ సమయంలో ఆయన మొబైల్ ఫోన్ వాడరాదని, మీడియాతో మాట్లాడరాదని సూచనలు చేసింది. సిసోడియా భార్య మెడికల్ రిపోర్టును కూడా తమకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా సిసోడియా శనివారం సాయంత్రం మళ్లీ తీహార్ జైలుకు వెళ్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News