Thursday, December 26, 2024

హాల్‌టికెట్‌కు నిప్పంటించి నిరుద్యోగి నిరసన

- Advertisement -
- Advertisement -

కేసముద్రం : గ్రూపు వన్ హాల్‌టికెట్‌కు నిప్పంటించి ఓ విద్యార్థి నిరసన తెలిపిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అమీనాపురం గ్రామానికి చెందిన నిరుద్యోగి పానుగంటి విష్ణువర్ధన్ నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తన గ్రూపు వన్ హాల్‌టికెట్‌ను దహనం చేశాడు.

ఈ సందర్భంగా విష్ణువర్ధన్ మాట్లాడుతూ టిఎస్పిఎస్సీ పేపర్ లీకేజి వ్యవహారంలో నామమాత్రపు అరెస్టులతో కాలం గడుపుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని వ్యక్తం చేశారు. పేపర్ లీకేజి వ్యవహారాన్ని సిట్ అధికారులు పూర్తి చేయకుండానే మళ్లీ పరీక్షలు నిర్వహించడంపై ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గ్రూపు వన్ స్థాయి ఉద్యోగ పరీక్ష నిర్వహణను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో నిరుద్యోగ భృతిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News