Wednesday, April 2, 2025

మంచి నటన, గ్లామర్‌తో…

- Advertisement -
- Advertisement -

రజనీకాంత్, తమన్నా భాటియా ప్రధాన తారాగణంగా నటించిన ‘జైలర్’ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మేకర్స్ ర్యాప్-అప్ వేడుకల నుండి కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి జోరుగా వైరల్ అయ్యాయి. రజనీకాంత్, తమన్నా,  దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌లతో కలిసి చిత్రబృందం కేక్ కట్ చేస్తున్న దృశ్యం ఆకట్టుకుంది. ఈ భారీ చిత్రం ఆగస్ట్ 10న విడుదల కానుంది. రజనీకాంత్ ని జైలర్‌గా చూడాలన్న ఉత్సాహం అభిమానుల్లో ఉంది.

దర్బార్ లాంటి హిట్ సినిమా తర్వాత రజనీకాంత్ బ్లాక్ బస్టర్‌పై కన్నేశారు. అది జైలర్ మూవీతో సాధ్యమవుతుందనే ఆశిస్తున్నారు. ఇందులో శివరాజ్ కుమార్-, మోహన్ లాల్,- జాకీ ష్రాఫ్,- రమ్య కృష్ణ తదితరులు నటించారు. 1987 చిత్రం ఉత్తర్ దక్షిణ్ సినిమా కోసం గతంలో చేతులు కలిపిన తర్వాత జాకీష్రాఫ్‌తో రజనీకాంత్ రెండవ సారి కలిసి పని చేస్తుండడం ఆసక్తికరం. జైలర్ చిత్రంలో తమన్నాకు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించిందని సమాచారం. మంచి నటనతో పాటు గ్లామర్‌తో ఈ మిల్కీ బ్యూటీ ప్రేక్షకులను అలరించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News