గ్రీన్ ఇండియా చాలెంజ్
మన తెలంగాణ/హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు వికారాబాద్ క్యాంపు ఆఫీస్‌లో ఎంఎల్‌ఎ మెతుకు ఆనంద్ మొక్క నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత అని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ ఛాలెంజ్‌లో 100 మొక్కలు నాటిన ఈవీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు
Also Read: రూ. 100కే చొక్కా..బేరమాడిన జపాన్ దౌత్యవేత్త
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా చాలెంజ్ లో బాగంగా నానక్ రాం గూడ టోల్ ప్లాజా వద్ద ఈవీ ఓనర్స్ అసోషియేషన్ సభ్యులు వంద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రశాంత్, ప్రఫుల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పభుత్వం గ్రీనరీ పెంపొందించడంలో ఎంతో ముందుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా చూసిన పచ్చదనం కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.ఇంత మంచి కార్యక్రమంలో తమను భాగస్వామ్యం చేసినందుకు ఎంపి సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవింద్, శ్రీనివాస్, సంతోష్ అనూశ్య తదితరులు పాల్గొన్నారు.