Monday, December 23, 2024

కోటి 58 లక్షల కంటి పరీక్షలు పూర్తి

- Advertisement -
- Advertisement -

లక్ష్యంలో 96.21 శాతం
22,21,494 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
12,304 గ్రామపంచాయతీ వార్డులు,
3598 మున్సిపల్ వార్డులలో కంటి పరీక్షలు పూర్తి

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి 58 లక్షల 35 వేల 947 మందికి కంటి పరీక్షలు చేశారు. దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించి 22 లక్షల 21 వేల 494 మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ అందజేశారు. ఇందులో 74 లక్షల 42 వేల 435 మంది పురుషులు, 83 లక్షల 73 వేల 097 మంది స్త్రీలు, 10,955 మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. కోటి 18 లక్షల 26 వేల 614 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Also Read: 33 ఏళ్లు క్రితం మరణించాడు అనుకున్నారు…. ఇప్పుడు తిరిగొచ్చాడు…

మారిన జీవన విధానం, వివిధ రకాల పని ఒత్తిళ్ల వల్ల కంటి సమస్యలపై ప్రజలు దృష్టి పెట్టాలని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నందున ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గత జనవరి 18 నుంచి జూన్ 15 వరకు వంద రోజుల కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు 96.21 శాతం కంటి పరిక్షలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 89 రోజుల పనిదినాలల్లో ఒక కోటి 58 లక్షల 35 వేల 947 మందికి కంటి పరీక్షలు పూర్తి చేసుకొని అనుకున్న లక్ష్యానికి మించి రెండు కోట్లకు చేరుకునే దిశగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది.

నివారించదగ్గ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నది. 2018లో నిర్వహించిన, మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా, కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించి, 50 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేయడం జరిగింది, ఈ సారి 100 పని దినాల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగింది.

ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం పురోగతిపై రోజువారీగా ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారు. ఎంత మందికి పరీక్షలు నిర్వహించారు, ఎంత మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు అనే అంశాలు ప్రతి రోజు తెలుసుకుంటున్నారు. స్క్రీనింగ్ పూర్తి చేసిన తర్వాత వెంటనే రీడింగ్ గ్లాసెస్, నాలుగు వారాల్లోగా ప్రిస్కిప్షన్ గ్లాసెస్ తప్పకుండా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. క్యాంపుల నిర్వహణ ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. సిబ్బందికి అవసరమైన భోజన, వసతి, వాహన సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News