చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు
ఇంజనీరింగ్ విద్యలో కళాశాల ఎంపిక, బ్రాంచీల గురించి వివరించిన కళాశాల సిబ్బంది
గ్రాడ్యుయేట్ చదివే సమయంలోనే తల్లిదండ్రులు పిల్లలపై దృష్టిపెట్టాలి: సుదీర్ సండ్ర
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో టీ న్యూస్ ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ మైదానంలో నిర్వహించిన తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ 2023 ఫెయిర్ విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో అదివారం ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు ఫెయిర్‌కు హాజరై కళాశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో వేలాదిమంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చి తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ సందర్శించి తమ కావాల్సిన బ్రాంచీల వివరాలను తెలుసుకున్నారు.
Also Read: చితిపై లేచికూర్చున్న శవం..పరుగులు తీసిన బంధుజనం
ప్రధానంగా ఇంజనీరింగ్ కోర్సులతో పాటు అన్ని కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించటం జరిగింది. ఇంజనీరింగ్ విద్యలో కమ్యూనికేషన్ స్కిల్స్, ప్లేస్మెంట్ అవకాశాలతో పాటు కళాశాలలో కోర్సులు ఎంపికపై ప్రొఫెసర్ డాక్టర్ మహిపతి శ్రీనివాసరావు ప్రత్యేక కార్యక్రమం ద్వారా విద్యార్థుల సందేహాలు నివృత్తి చేశారు. ముఖ్యంగా వెబ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉన్న సందేహాలను అన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాక్ వెబ్ కౌన్సిలింగ్ లో నివృత్తి చేసుకున్నారు. వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియపై ప్రొఫెసర్ డాక్టర్ దారా రాజు పలు విషయాలను వివరించారు. అనంతరం ప్రముఖ వ్యక్తిత్వాన్ని వికాస నిపుణులు సుధీర్ సండ్ర విద్యార్థులకు నాలుగేళ్లలో కెరియర్ ఎలా మలుచుకోవాలో కోర్స్ ఏదైనా ఏ విధంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలో తన మోటివేషన్ ద్వారా విద్యార్థులను తల్లిదండ్రులను తెలిపారు.
తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో తమకు కావాల్సిన సమాచారాన్నంతా ఒకే చోట సేకరించి ఒక గొప్ప అవకాశం కల్పించిన టీ న్యూస్ నిర్వహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అటు కాలేజీ యాజమాన్యాలు సంతృప్తి వ్యక్తం చేస్తూ మూడు రోజుల పాటు జరిగిన ఎడ్యుకేషన్ ఫెయిర్ లో తమ తమ కాలేజీ సమాచారం ఇవ్వడంతో పాటు విద్యార్థి ఏ గ్రూపు ఎంపిక చేసుకోవాలో భవిష్యత్తులో ఎటువంటి కోర్సులకు డిమాండ్ ఉంటుందో తెలియజేశామని కాలేజీ ప్రొపెసర్లు పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్ ను విజయవంతం చేసిన కాలేజీ యాజమాన్యాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు టీ న్యూస్ సీజీఎం ఉపేందర్ కృతజ్ఞతలు తెలిపారు ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో పాల్గొన్న కాలేజి యాజమాన్యాలకు టీ న్యూస్ ఉపేంద్ర చేతుల మీదుగా మెమెంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో టీన్యూస్ డీజీఎం కిరణ్, మార్కెటింగ్ టీం సత్యపాల్ శ్రీనివాస్, ఉదయ్ భాస్కర్, వెంకట్‌రెడ్డి, సతీష్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్- 2023కు ప్లాటినం స్పాన్సర్‌గా మర్రి లక్ష్మణ్‌రెడ్డి విద్యా సంస్థలు, డైమండ్ స్పాన్సర్‌గా సీఎంఆర్ విద్యా సంస్థలు, గోల్ స్పాన్సర్‌గా విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవహరించాయి.