Thursday, October 24, 2024

పల్లెల్లో దశాబ్ది సంపద వనాలు

- Advertisement -
- Advertisement -

ఎకరం నుంచి 20 ఎకరాల వరకు సంపద వనాల ఏర్పాట్లు
ఎంపికలో సాగునీటి కాలువలు, ప్రాంతాలకు ప్రాధాన్యం
ఈ నెల 19న పెద్ద ఎత్తున్న మొక్కలు నాటేందుకు కార్యాచరణ
వృక్ష సంపదను ఆర్థిక వనరుగా తీర్చిదిద్దే ప్రభుత్వ ప్రయత్నం

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ అవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు వేదికగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపునకు మరో బృహతర ప్రయత్నం చేపట్టింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కాలువలు, ఖాళీ స్థలాలతో పాటు, ఇతర స్థలాలను గుర్తించి.. వాటిలో ఆదాయానిచ్చే మొక్కలను నాటేందుకు కార్యాచరణ చేపట్టింది. 20 గుంటల స్థలం నుంచి 20 ఎకరాల వరకు ఉండే ఖాళీ స్థలాలను మొక్కల పెంపకానికి అనుకూలంగా తీర్చిదిద్ది.. ఆదాయానిచ్చే వృక్ష జాతులతో పాటు పండ్ల మొక్కలను విరివిగా నాటేందుకు ఏర్పాట్లు చేశారు. దశాబ్ధి ఉత్సవాల్లోనే సంపద వనాల ఏర్పాట్లుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఈ వనాల ఏర్పాట్లకు వీలుగా ఈ నెల 6వ తేదీ నుంచి టెండర్లను స్వీకరిస్తున్నారు.

Also Read: సింగపూర్‌లో స్పైబాస్ భేటీ

అదే విధంగా వనాల రక్షణ ఏర్పాట్లల్లో భాగంగా ఫెన్సింగ్, ఇతర ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెల 19న పెద్ద ఎత్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టనున్నారు. తొమ్మిది విడుత తెలంగాణకు హరితహారంలో భాగంగా దశాబ్ది సంపద వనాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్లాంటేషన్ల ఏర్పాట్లకు అవసరమైన విధివిధానాలను జాతీయ గ్రామీణ ఉపాధిహామీ సిబ్బందికి అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సూచించారు. ప్రతిబ్లాక్‌లో టేకు, రోజ్ వుడ్ వేపా, వంటి కలప దిగుబడినిచ్చే జాతులతో పాటు గుమ్మడి టేకు, వెదురు, చింత, జామ, సీమ చింత, ఉసిరి, మామిడి, సీతాఫలం, వెలగ, మేడి పండ్ల మొక్కలను నాటనున్నారు. ఈ వనాలలో మొక్కలకు నీళ్ళు పోయడానికి ట్రాక్టర్ & ట్యాంకర్ తరలించడానికి 3 మీటర్ల వెడల్పు మార్గం ఏర్పాటు చేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News