జోగిపేట: విద్యుత్ సంస్కరణల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ ప్రగతి సంబరాలు జరిపారు. ఇందులో ఆమె మాట్లాడుతూ కెసిఆర్ దూరదృష్టితో తెలంగాణలో విద్యుత్ ప్రగతిని సాధించరన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు. ప్రత్యేక సాధించిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. 24 గంటలు వ్యవసాయ రంగానికి ఉచితంగా సంపూర్ణంగా ఇస్తున్న ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని మాట్లాడిన అప్పటి సిఎం ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. విద్యుత్ రంగంలో ఏ దేశంలో లేని విధంగా ప్రగతి సాధించినట్లు పొగిడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డి, జడ్పీ సిఈఓ ఎల్లయ్య, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.