సంగారెడ్డి: ఆక్టోబర్ 1నాటికి 1 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. సోమమవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో ఓటరు జాబితాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్నీ అధికారులు సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఆక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా తమ వివరాలను నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించి అర్హులైన వారి నుండి దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్ తెలిపారు.
బూత్ స్థాయి అధికారులు ఈ నెల15లోగా ఇంటింటి సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆక్టోబర్ నాటికి 18 సంవత్సరాలు నిండే ఓటర్ల వివరాలను బిఎల్‌ఓలు సేకరించాలన్నారు. గత సంవత్సరం జనవరి 1 నుంచి జనవరి 1 2023దాకా వివిధ కారణాలతో తొలగించిన ఓటరు జాబితా మరో మారు పరిశీలించాలన్నారు. ఫారం 6,7,8లకు సంబంధించి అప్లికేషన్‌పై దరఖాస్తు దారు సంతకం ఉండాలన్నారు. ఫారం 6ఓటరు దరఖాస్తు సంబంధించి పుట్టిన తేదీ వివరాలను ఉండాలని, అదే విదంగా ఫారం 7కు సంబంధిచి చనిపోయిన ఓటరు విషయంలో కచ్చితంగామరణ ధృవీకరణ పత్రం ఉండాలని అదే విధంగా షిప్ట్ కింద దరఖాస్తు వస్తే దాన్నీ రిజెక్ట్ చేసినట్లయితే ఆ పేరును ఏఎస్‌డి జాబితాలో చేర్చాలని పూచించారు. రిపిటెడ్ పేర్లు వచ్చినా వాటిని ఏఎస్‌డి జాబితాలో రాయాలన్నారు.
జూన్ 24 నుంచి 30లోపు పోలీంగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేయాల్సి ఉన్నందును 1500 ఓటర్లు దాటిన పోలీంగ్ కేంద్రాలను పరిశీలించి అవసరమైన కొత్త లీంగ్ కేంద్రాలను ప్రతిపాదించాలని సూచించారు. ఓకే లోకేషనల్‌లో 4కన్న ఎక్కువ పొలీంగ్ కేంద్రాలు ఉన్నటువంటి వివరాలు సేకరించాలన్నారు. ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను నూతన ఓటరు నమోదు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కరించాలని తెలిపారు. మరణించిన ఓటర్లు గ్రామాన్నీ వదిలి వెళ్లిపోయిన వారు ఓకే ఓటరు రెండు సార్లు వచ్చిన వారిని గుర్తించి నిబంధనల మేరకు నోటీసులు జారీ చేసి వివరాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓకే ఇంట్లో ఉన్న ఓటర్లందరికి ఓకే పోలీంగ్ కేంద్రం పరిధి ఓటరు జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే సమయంలో నిర్దిష్ట నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డిఆర్‌ఓ నగేష్, ఆర్‌డిఓలు రవీందర్‌రెడ్డి, అంబదాస్, అధికారులున్నారు.