Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

చిన్నంబావి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలోని చిన్నంబావి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చిన్నంబావి మండలంలోని అమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మహేష్ గౌడ్(25) విద్యుత్ డిపార్టెంట్‌లో కాంట్రాక్టు కింద స్పాట్ బిల్లర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో కరెంట్ బిల్లులు కొట్టి కొల్లాపూర్‌లో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు హాజరయ్యేందుకు వస్తుండగా మండల కేంద్రం సమీపంలోని కేడిఆర్ పాఠశాల వద్ద అతనిని ఆటో ఢీ కొట్టడంతో అదే సమయంలో రోడ్డు పక్కన పొలంలోని వ్యర్థాలకు రైతు నిప్పు పెట్టడంతో ఆ మంటల్లోకి ఎగిరిపడి మంటల్లో కాలి సజీవ దహనమయ్యాడు. యువకుడి అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కొడుకు అగ్నికి ఆహుతి అవడంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News