Monday, December 23, 2024

2028 నాటికి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సిటీగా హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: పర్యావరణాన్ని రక్షించడానికి సామాజికంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిహెచ్‌ఎంసి అధికారులు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని “మేరీ లైఫ్ మేర స్వచ్ఛ షేహర్ ” పేరిటజిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో సోమవారము వివిధ విభాగాల హెచ్‌ఓడి లు అధికారులు సిబ్బంది అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షించుకుందామ అనే నినాదాలతో ర్యాలీని నిర్వహించారు. 2028 సంవత్సరం నాటికి హైదరాబాద్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సిటీగా రూ పాంతరం చెందేదుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్వచ్ఛత దైనందిన జీవనశైలిలో అలవాటుగా మార్చుకోవడం ద్వారా పనికిరాని వస్తువులు పునర్వినియోగం చేసుకునే అవకాశం కలదన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్,) మేరీ లైఫ్, మేరా స్వచ్ఛ్ షెహార్ నినాదంతో ముందుకుపోవాలని ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఉపయోగించని వస్తువులు, పాత పుస్తకాలు, బట్టలు, బొమ్మలు మొదలైనవాటిని స్వచ్ఛందంగా నగరంలో ఏర్పాటు చేసిన త్రిబుల్.ఆర్ కేంద్రాల్లో ఇవ్వాలని, ఈ వస్తువులు తిరగి పునర్నిర్మించి పునర్వినియోగించుకోవడం జరగుతుందన్నారు.ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ వి. కృష్ణ, జయరాజ్ కెన్నెడీ, సిసిపీ దేవేందర్ రెడ్డి అడిషనల్ సిసిపీ శ్రీనివాస్ రావు, సిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ పద్మజ, సిపీఅర్ ఓ మొహమ్మద్ ముర్థుజా, అకౌంట్ చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర రెడ్డి, జాయింట్ కమిషనర్ లు ఉమ ప్రకాష్, వెంకట్ రెడ్డి శశికళ, యస్ బి ఏమ్ భారత్, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News