Saturday, November 23, 2024

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

దుబ్బాక: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక పట్టణంలోని శ్రీసాయి బాలాజీ గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ ప్రగతి కార్యక్రమం లో సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత రైతులకు ప్రభుత్వం ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇవ్వడమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు విద్యుత్ అధికారులు అందుబాటులో ఉండి త్వరితగతిన సమస్యలు పరిష్కారం చేస్తున్నారని తెలిపారు.

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఎదురుకున్న విద్యుత్ ఇబ్బందులను వివరిస్తూ నేటి పరిస్థితులను రైతులకు, ప్రజలకు కళ్ళకు కట్టినట్టు వివరించడంజరిగింది. సిఎం కెసిఆర్ రైతులకు ఎల్లపుడు అండగా ఉంటూ వారి అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అని స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొత్త పుష్ప లత వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చింతల జ్యోతి, పిఎసిఎస్ చైర్మన్ షేర్ల కైలాసం, మున్సిపల్ చైర్‌పర్సన్ గన్న వనిత ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, విద్యుత్ అధికారులు, బిఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News