హైదరాబాద్: నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న జలమండలి ఈ ఏడాది ఇప్పటికే రెండు అవార్డులు గెలుచుకోగా తాజాగా మ రో అవార్డు లభించింది. మురుగు శుద్ధిలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్నందుకు, వంద శాతం మురుగు శుద్ధి కోసం ఎస్టీపీలను వేగంగా నిర్మిస్తున్నందుకు జలమండలికి పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అవార్డు వరించింది. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ అవార్డు అందజేశారు.
సనత్‌నగర్‌లోని పొల్యుషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబుకు అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు. అనంతరం డైరెక్టర్ శ్రీధర్ బాబు బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎండీ దానకిశోర్‌ను అధికార బృందంతో కలిసి అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందించారు. జలమండలికి ఈ అవార్డు రావడంపై ఎండీ హర్షం వ్యక్తం చేసి సంబంధిత అధికారులను అభినందించారు.