- Advertisement -
న్యూఢిల్లీ : ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల్లో మరింత బలపడనున్నది. నైరుతి రుతుపవనాలను ప్రభావితం చేయనుందని భారత వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. అయితే కేరళను రుతుపవనాలు రెండు రోజుల్లో తాకే అవకాశం ఉందని అంచనా వేసింది.
దక్షిణ అరేబియా సముద్రం మీదుగా 2.1 కిలోమీటర్ల వరకు పశ్చిమ గాలులు వీస్తాయని పేర్కొంది. సైక్లోనిక్ సర్కులేషన్ కారణంగా మేఘాలు కలిసి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటాయని , దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కేరళ తీరం వైపు వెళ్లే అవకాశాలపై ప్రభావం పడనున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది.
- Advertisement -