Tuesday, December 24, 2024

దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

నర్సాపూర్: విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రగతి ఆమోగమని,ప్రత్యేక రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని, దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి పనులు చేసుకున్నామని, రాష్ట్ర మహిళా కమిష న్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని, సాయి కృష్ణ కళ్యాణమండపంలో, తెలంగాణ రాష్ట్ర అ వతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, సోమవారం వి ద్యుత్ శాఖ ఆధ్వర్యంలో, విద్యుత్ ప్రగతి ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా విద్యుత్ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను వి వరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో, కరెంటు ఎ ప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం హ యాంలో, రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచ్చిత వి ద్యుత్‌ను, అందించడం జరుగుతుందన్నారు. తెలంగా ణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్తును అందివ్వడం వల్ల, ప్రపంచ దేశాల పారిశ్రామికవేతలు, మన రాష్ట్రంలో పరిశ్రమలను పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నా రు. గతంలో వ్యవసాయం దండగ అన్నారని, ప్రస్తుతం వ్యవసాయాన్ని పండగల చేసుకుంటున్నామని, సం తోషం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్, జిల్లా కోఆప్షన్ నెంబర్ మన్సూర్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకటరెడ్డి ,పిఎసిఎస్ లు చైర్మన్ రాజు యాదవ్, వెంకటరామిరెడ్డి, జడ్పిటిసి బాబ్యానాయక్, వివిధ మండలాల జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News