లండన్: మిర్రర్ గ్రూప్ వార్తాపత్రికలు డైలీ మిర్రర్, సండే మిర్రర్, సండే పీపుల్ లకు వ్యతిరేకంగా న్యాయపోరాటంలో సాక్ష్యం ఇవ్వడానికి ఆదివారం లండన్‌లోని హైకోర్టుకు హాజరైన ఇంగ్లాండ్ యువరాజు హ్యారీ. ఈ పత్రికల జర్నలిస్టులు అక్రమాలకు పాల్పడుతున్నారని, అంటే ఫోన్ హ్యాకింగ్, సమాచారాన్ని సేకరించేందుకు మోసం, చట్టవతిరేక కార్యకలాపాల కోసం ప్రైవేట్ పరిశోధకులను ఉపయోగించడం వంటివి చేస్తున్నాయని, అందుకు నష్టపరిహారం కోరుతున్నట్లు ఆయన సాక్ష్యం ఇవ్వడానికి కోర్టుకు హాజరయ్యారు.
వాస్తవానికి జూన్ 5న ఆయన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉండింది. కానీ జూన్ 6కు అది రీషెడ్యూల్ అయింది. 130 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ యువరాజు కోర్టుకు సాక్షిగా రావడం ఇప్పుడేనని ‘ది ఇండిపెండెంట్ ’ నివేదించింది. హ్యారీ తరఫు న్యాయవాది డేవిడ్ షెర్‌బోర్న్ వాదనలు వినిపిస్తూ మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్లు తన క్లయింట్, ఆయన సోదరుడికి మధ్య సంబంధాల్లో ఎలా చిచ్చు పెడుతున్నాయో విరించారు. ఇద్దరి మధ్య విశ్వాసం సన్నగిల్లజేసిందన్నారు.
అయితే మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్ ఆరోపణలను ఖండించింది. నేడు డ్యూక్ ఆఫ్ సస్సెక్స్‌ని ముద్రాపకుడి న్యాయ బృందం క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది.
పీయర్స్ మోర్గాన్ ఎడిటర్‌గా ఉన్న రోజల్లో మిర్రర్ జర్నలిస్టులు రాణి డయానా వాయిస్ మెయిల్స్‌ను యాక్సెస్ చేశారని హ్యారీ న్యాయవాది డేవిడ్ కోర్టుకు తెలిపారు. అంతేకాక ఆ జర్నలిస్టులు ‘స్కై న్యూస్’ ప్రకారం హ్యారీకి ఆయన సోదరుడు ప్రిన్స్ విలియమ్‌కు మధ్య అవిశ్వాసాన్ని సృష్టించారన్నారు. అంతేకాక యువరాజు హ్యారీకి ఆయన మాజీ గర్ల్‌ఫ్రెండ్ చెల్సీ డేవీకి గురించి తప్పుగా వార్తాలు రాశారని కూడా వాదించారు.