Tuesday, January 21, 2025

నీరు అనేది మానవ జీవితంలో అతి ముఖ్యమైనది

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: నీరు అనేది మానవ జీవితంలో అతి ముఖ్యమైనదని సెంట్రల్ డిఫెన్స్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ అండ్ అడిషనల్ ఫైనాన్స్ అడ్వైజర్ వేద్ వీర్ ఆర్య అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో నీటి సంరక్షణపై కేంద్ర జల శక్తి అభిమాన్ బృందం సభ్యులు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్షం నీటిని ఒడిసి పట్టడం, నీటి సంరక్షణకు జిల్లాలో చేపట్టిన పనులు చాలా బాగున్నాయని అభినందించారు. భూగర్భ జలాల సంరక్షణ మరి భూగర్బ జలాల పెంపునకు చేపట్టిన పనుల ఫలితాలు కనబుతున్నాయని అన్నారు. మానవ శరీరంలో కూడా 75 శాతం నీరు ఉంటుందన్నారు.

పాఠశాలలో పిల్లలకు నీటి సంరక్షణ గురించి చెబుతున్న తీరు చాలా బాగా ఉందని బావి పౌరులైన చిన్నారులకు, ప్రజలందరికి నీటి సంరక్షణపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సమావేశం అనంతరం జలశక్తి అభిమాన్ అధికారులు నీటి సంరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఆటవీ శాఖ అధికారి శ్రీనివాస్, డిఆర్డీఓ చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్, జిల్లా హార్టికల్చర్ అధికారి కవిత, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ పేదల శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News