Monday, December 23, 2024

పార్కింగ్ విషయంలో గొడవ పడ్డ ఇద్దరికి జైలుశిక్ష

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ : ఓహోటల్ ముందు పార్కింగ్ విషయంలో గొడవ పడిన ఇద్దరు వ్యక్తులకు జెలుశిక్ష పడింది. బోయిన్‌పల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం… ఓల్డ్‌బోయిన్‌పల్లి హస్మత్‌పేట్‌కు చెందిన రాజేష్ (25), శివ(30) ఇద్దరు స్నేహితులు వీరిద్దరు రెండు రోజుల క్రితం బోయిన్‌పల్లి మార్కెట్ సమీపంలో అల్డిన్ హోటల్ వద్దకు టీ తాగటానికి వచ్చి తమ బైకులను హోటల్ ముందు పార్కు చేసి మాట్లాడుకుంటున్నారు. రాకపోకలకు అడ్డుగా బైక్ ఉండటంతో బైక్‌ను తీయాలని వారితో చెప్పాడు.

దీంతో హోటల్ యజమాని రాజేష్, శివలకు వాగ్వివాదం చోటు చేసుకోవటంతో తోపులాట జరిగింది. తోపులాటలో హోటల్ యజమానికి గాయాలు కావంటతో హోటల్ యజమాని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఆదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా మూడు రోజుల జైలుశిక్షను విధిస్తు తీర్పు ఇచ్చింది. దీంతో ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News