హైదరాబాద్ ః ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీలో ప్రవేశాల కోసం -సిపి సెట్‌ను కన్వీనర్ పాండురంగారెడ్డి విడుదల చేశారు. ఎంఏ, ఎంఎమ్మెసీ, ఎంకామ్, ఎంఈడి, ఎంపిఈడి కోర్సులు, విద్యా సంవత్సరానికి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాల క్యాంపస్ అనుబంధ కళాశాలల డిప్లొమా, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లు ఉన్నట్లు పేర్కొన్నారు.
45 సబ్జెక్టులకు పరీక్షలు ఈనె 30 నుండి జులై 10 వరకు రోజుకు మూడు సెషన్‌లలో జరుపుతున్నట్లు తెలిపారు. హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.in, https://cpget.tsche.ac.in, www.ouadmissions.com నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను ముందుగా సందర్శించి పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందే చేరుకోవాలని సూచించారు.