Monday, December 23, 2024

నేరవేరిన క్యాన్సర్ బాధితురాలు స్వాతి కళ సాకారం

- Advertisement -
- Advertisement -
  • చివ్వెంల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా ఒక్కరోజు బాధ్యతలు
  • త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించిన ఎస్పీ

సూర్యాపేట : అనారోగ్యంతో బాధపడుతున్న క్యాన్సర్ వ్యాధి బాధితురాలు త్వరగా కోలుకోని పోలీస్ అధికారి కావాలన్న తన మనస్సులో మాటను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో ఇటీవల పంచుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి క్యాన్సర్ బాధితురాలు స్వాతి కళను సాకారం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌కు సూచనలు చేశారు. దీంతో ఏస్పీ మంగళవారం క్యాన్సర్ వ్యాధితో బాదపడుతున్న స్వాతిని కళ సాకారం కార్యక్రమంలో భాగంగా చివ్వెంల మండల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా ఒక్కరోజజు బాధ్యతలు నిర్వహించేందుకు బాధ్యతలను అప్పగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరగా స్వాతి ఆరోగ్య కుదుటపడాలని, జీవితంలో ఆమె ఆశయాన్ని సాధించేలా ధైర్యంగా ఉండాలని ఆకాక్షించారు. అనంతరం ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు తీసుకున్న స్వాతి పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు ధైర్యం కల్పించేచి అంండగా నిలవాలన్నారు. తన కళను సాకారం చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్‌మంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం, డిప్యూటి డీఎంహెచ్‌వో డాక్టర్ హర్షవర్ధన్, సూర్యాపేట రూరల్ సీఐ సోంనారాయణ సింగ్, స్పెషల్ బ్రాంచీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై విష్ణుమూర్తి, స్వాతి తల్లిదండ్రులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News