- Advertisement -
బెంగళూరు : 2024 లోక్‌సభ ఎన్నికలకు బీజేపికి వ్యతిరేకంగా విపక్షపార్టీలన్నీ ఏకం కావడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. విపక్షాల ప్రయత్నాల గురించి ఆయన ఏం పెదవి విప్పడం లేదు. కానీ ఏ పార్టీ మతపరమైనది, ఏ పార్టీ కాదో తాను చెప్పలేనని,
ఏదైనా పార్టీ బీజేపీతో సంబంధం లేనిదంటూ ఉందా ? ఉంటే చూపించండి అని ఆయన వ్యాఖ్యానించారు. జేడి(ఎస్)చీఫ్ అయిన దేవెగౌడ మంగళవారం దేశ రాజకీయాలపై తనదైన అనుభవాలతో నిర్లిప్తంగా మాట్లాడారు . దేశ రాజకీయాలపై తాను విశ్లేషించగలనని, దాని వల్ల ప్రయోజనం ఏముందని ఆయన ఎదురు ప్రశ్న వేశారు.
- Advertisement -