Saturday, November 23, 2024

సాగునీటి రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే మోడల్‌గా మారింది
  • దశాబ్ది ఉత్సవాలలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ : సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నార్కెట్‌పల్లి మండలం కేంద్రంలో జరిగిన సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష కారణంగా వెనుకబడ్డ తెలంగాణలో ముఖ్యమంత్రి 9సంవత్సరాల కాలంలోనే అనేక అద్భుత ఫలితాలు సాధించి దేశంలోనే నెంబర్‌వన్ తెలంగాణగా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ,అలాంటి కృషి పట్టుదల గల నాయకుడికి వెన్నుదన్నుగా రైతులు నిలవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

అసాధ్యం అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం 4 సంవత్సరాల కాల వ్యవధిలోనే నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా కీర్తి గడించారని ఆయన ఈ సందర్భంగాకాళేశ్వరం ప్రగతిని వివరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రైతులకు సాగునీరు అందించడం కోసం ఆయా జిల్లాల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించి అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, నిర్మిస్తున్న ప్రాజెక్టులు సంపూర్ణంగా పూర్తి కావాలంటే మరోసారి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.

కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండానే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ , రైతుల సాగు పెరగడం కోసం భూగర్భజలాలు పెంచడం కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఇప్పటికే సత్ఫలితాలు అందించిందని తెలిపారు. మిగిలిపోయిన ప్రాజెక్టులు కూడా పూర్తి అయితే తెలంగాణకు ఎదురు ఉండదని అన్నారు. రాజకీయాలలో పదవులు శాశ్వతం కాదని ప్రజలకోసం కష్టించి పనిచేస్తే సంతృప్తి కలుగుతుందని , అలాంటి విజయంతో పనిచేసే అవసరం ఉందని, అలాంటి విజయంతో చేసే నాయకుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని, ఆయన ఆదేశాలను పాటిస్తూ తెలంగాణను మరింత ప్రగతి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామం కావాలని పిలుపునిచ్చారు.

నకిరేకల్ నియోజకవర్గంలో త్వరలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం సముద్రం ద్వారా లక్ష ఎకరాలకు , పిల్లాయిపల్లి, మూసి, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించబోతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్, జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ సహకారంతో నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా సాగునీటి రంగంలో అద్భుత ఫలితాలు సాధించామని, ఈ మద్యకాలంలోనే ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి ,జిల్లా గ్రంధాలయ చైర్మన్ రెగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి ,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ,జిల్లా ఇరిగేషన్ ఎస్ ఈ అజయ్ కుమార్,నికిరేకల్ నియోజకవర్గంలో గల చిట్యాల ,కట్టంగూర్ ,కట్టంగూరు, రామన్నపేట, ఎంపిటిసిలతో పాటు ,జెడ్‌పిటిసిలు , చిట్యాల మున్సిపల్ చైర్మన్ ,మార్కెట్ కమిటి చైర్మన్ , వివిద గ్రామాల సర్పంచులు , ఎంపిటిసిలు, కార్యనిర్వాహక ఇంజనీర్ సురేందర్‌రావు,రిటైర్డ్ ఇంజనీర్లు టి.వెంకటేశ్వర్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News