Saturday, November 23, 2024

కాల్‌ సెంటర్ ఉద్యోగులు 8 మంది హత్య

- Advertisement -
- Advertisement -

మెక్సికో సిటీ : మెక్సికోలో కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగం మానేందుకు సిద్ధమైన సమయంలో హత్యకు గురైన దుర్ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. అమెరికన్లను లక్షంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న మెక్సిన్ లోని ఓ డ్రగ్ కార్టెల్‌లో ఈ దారుణం జరిగింది.

అమెరికా, మెక్సికో అధికారులు దీన్ని ధ్రువీకరించారు. మెక్సికో లోని గువాడలజరా సమీపంలో జలిసో న్యూ జనరేషన్ కార్టెల్ ఆధ్వర్యంలో ఆ కాల్‌సెంటర్ నడుస్తోంది. మెక్సికో లోనే అత్యంత హింసాత్మక ముఠాగా జలిసోకు పేరుంది. అయితే ఇందులో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళల జాడ మే 2022 మధ్యకాలంలో కనిపించడం లేదని పోలీస్‌లకు ఫిర్యాదు అందింది. వీరంతా 30 ఏళ్లలోపు వారే. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా వీరి శరీర భాగాలతో ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఆ ప్రాంతంలో బయటపడ్డాయి.

ఫోరెన్సిక్ పరీక్షల్లో ఆ శరీర భాగాలు తప్పిపోయిన ఉద్యోగులవే అని తేలింది. ఈ జలిసో ముఠా సాధారణ కార్యకలాపాలు కాకుండా డ్రగ్స్ అక్రమ రవాణా, దోపిడీ, కిడ్నాప్‌ల వంటి వాటికి పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరిట అమెరికన్లు, కెనడియన్లను లక్షంగా ఈ కాల్‌సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీస్ దర్యాప్తులో బయటపడింది.

ఈ నేపథ్యంలో ఇందులో పనిచేస్తున్న వారు హత్య కావింపబడడానికి కారణాలు ఇంకా తెలియనప్పటికీ, వారంతా ఉద్యోగం మానేయడానికి ప్రయత్నిస్తున్నందునే ఈ హత్యలు జరిగాయని పోలీస్‌లు అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబీకులు మాత్రం తమ పిల్లలు సాధారణ కాల్‌సెంటర్‌లోనే పనిచేస్తున్నట్టు అనుకుంటున్నామని దర్యాప్తు సంస్థలకు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News