Monday, December 23, 2024

జలకళ సంతరించుకున్న తెలంగాణ

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: సిఎం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం సాగునీటి రంగంలో ఎనలేని అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక సాఖి చెరువు కట్టపై ఘనంగా ఉత్సావాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్‌ను మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ కాకతీయతో చెరువులు కుంటల్లో నీళ్లు పుష్కలంగా ఉండడంతో రైతులు పంటలు పుష్కలంగా పండించుకో కలుగుతున్నారన్నారు. రెడ్డి కాకతీయుల కాలంగా నాటి చెరువుల్లో కెసిఆర్ ప్రభుత్వం పుడికలు తీసిందన్నారు.

చెరువుల ఆయకట్టు పెరగడంతో వరి దిగుబడి పెరిగిందన్నారు. రాష్ట్ర రైతాంగం ఆర్థికంగా ఎదగడానికి 24 గంటల విద్యుత్, మద్దతు ధరలే కారణ మైయ్యాయన్నారు.గ్రామీణ ప్రాంత చెరువులే కాకుండా పట్టణ పరిధిలోని చెరువులు సైతం అభివృద్ధి జరిగాయన్నారు.సాఖి చెరువు అభివృద్ధ్దికి రు. 5 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి సుష్మశ్రీ వేణుగాపాల్ రెడ్డి, జెడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, సింధు ఆదర్శరెడ్డి, పుష్ప నగేశ్ అధికారులు ఆనంద్, రామస్వామి, నళిని అధికారులు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News