Monday, December 23, 2024

కంపౌడర్ నుంచి క్రిమినల్ దాకా…

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కోర్టులో బుధవారం గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరీ జీవాను కాల్చివేశారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి లాయర్ దుస్తులలో వచ్చినట్లు తెలిసింది. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ రాష్ట్ర పోలీసుల కస్టడీలో ఉన్న దశలో కోర్టుకు తీసుకువచ్చినప్పుడు ఈ కాల్పుల ఘటన జరిగింది.

సంజీవ్ జీవా ముందు తన జీవన వృత్తిని ఓ కంపౌడర్‌గా ఆరంభించారు. తరువాత పెద్ద పెద్ద క్రిమినల్స్ వద్ద చేరి చివరికి తానే నేర చీకటి సామ్రాజ్యంలో కీలక పాత్రకు ఎదిగాడు. భాగ్‌పట్ జైలులో ఉన్నప్పుడు 2018లో హత్యకు గురైన మున్నా భజ్‌రంగ్‌కు జీవా అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. తరువాత అతీక్ అహ్మద్ వెంబడి తిరిగారు. పశ్చిమ యుపిలో పలు రకాల దందాలతో సంజీవ్ తన నేర ఖాతాను పెంచుకుంటూ వెళ్లాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News