Monday, December 23, 2024

కాళేశ్వరం జలానికి లక్షజనహారతికి వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డు

- Advertisement -
- Advertisement -
  •  వేడుకలో లక్ష్యానికి మించి హాజరైన రైతులు, ప్రజలు
  • నిర్వహకులు మంత్రి జగదీష్ రెడ్డికి మెమోంటో, ప్రశంసాపత్రం అందజేసిన ప్రతినిధులు

సూర్యాపేట : ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ప్రారంభించిన తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకోని పదో సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుండి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 5వ రోజు సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాక ముందు బీడు భూములతో దర్శనమించే సూర్యాపేట జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కాళేశ్వరం జలాల మొదటగా అందించి సస్యశ్యామలం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సిఎం కెసిఆర్‌కు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపేందుకు కాళేశ్వరం జలాలకు లక్షమందితో స్వాగత హారతి ఇచ్చి స్వాగతం పలికే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గత వారం రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధులతో వివిధ దఫాలుగా సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచలను చేశారు. జిల్లాలో నాగారం మండలం ఈటూరు నుంచి చివరగా కాళేశ్వరం జలాలు చేరే పెన్‌పహడ్ వరకు ఎస్సారెస్పీ కాల్వల వెంట రైతు లు, ప్రజలు లక్ష జనహారతి ఇచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించారు. బుధవారం కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 68 కిలోమీటర్ల మెర ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేస్తూ ఒకే సమయంలో కాళేశ్వరం జలాలకు హారతులు, స్వాగతం పలికే విధంగా చర్యలు తీసుకున్నారు.

విషయం తెలుసుకున్న వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డులు ప్రతినిధు లు మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు కార్యక్రమం నిర్వహిస్తున్న ఆరు మండలాల్లో పర్యటించి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల సంఖ్యను గుర్తించారు. లక్ష మందితో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా అనుహ్యంగా మండలాల వారిగా నాగారం మండలంలో 18137 మంది, జాజిరెడ్డిగూడెంలో 18148 మంది, ఆత్మకూర్(ఎస్) 19677 మంది, సూర్యాపేట మండలంలో 19881, చివ్వెంల మండలంలో 20239, పెన్‌పహడ్ మండలంలో 20060 మందితో ఈ ఆరు మండలాల్లో లక్ష 16వేలకు పైగా మంది కార్యక్రమంలో పాల్గొన్నట్లు వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డు ప్రతినిధులు గుర్తించినట్లు తెలిపారు.

దీంతో కార్యక్రమం వేదికపై వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డు ప్రతినిధులు నరేందర్ గౌడ్, గంగాధర్‌లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి శాలువాలతో సన్మానించి మెమోంటో, ప్రశంశాపత్రంతో పాటు మెడల్‌ను అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి విజయంతం చేసేందుకు కృషి చేసిన కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్‌లను సన్మానించి మెమోటో,మెడల్, ప్రశంశాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, జడ్పి సిఈవో సురేష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, ఎంపీపీ కుమారిబాబు నాయక్, జడ్పీటీసీ భూక్యా సంజీవ్ నాయక్, వైస్ ఎంపిపి జీవన్ రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News