సీగ్రామ్స్ రాయల్ స్టాగ్ ఎల్లప్పుడూ కలలు కనే, సాధించి చూపించే, ఘనంగా జీవించటాన్ని (లివింగ్ ఇట్ లార్జ్) సోదాహరణంగా చూపుతుంటుంది. కొత్త లివ్ ఇట్ లార్జ్ క్యాంపెయిన్‌ను విడుదల చేయటంతో బ్రాండ్ ఒక మార్పు దిశలో ప్రస్థానాన్ని ప్రారంభించటంతో, ఈ ఏడాది ఒక మైలురాయికి సూచిక. విజయానికి మార్గాలను పునర్నిర్వచించే నేటి తరం, జనరేషన్ లార్జ్ యొక్క స్ఫూర్తి, ప్రవర్తనకు ఈ క్యాంపెయిన్ రూపాన్నిస్తుంది. ప్రభావవంతమైన ఈ కొత్త క్యాంపెయిన్‌లో బాలీఉడ్ పవర్‌హౌస్ సూపర్‌స్టార్ రన్వీర్ సింగ్ కనిపిస్తారు. రన్వీర్ నేడు దేశంలో అతి పెద్ద స్టార్లలో ఒకరు కావటం మాత్రమే కాక, తన సమకాలీన ఉత్తమ నటుల్లో ఒకరు. బ్రాండ్ యొక్క క్యాంపెయిన్ తీరుకు ఉదాహరణననిస్తూ, “మాకు అంతా కావాలి, మాకు ఈ రోజే కావాలి. మేము జనరేషన్ లార్జ్!”, ఆవిర్భవించిన రాయల్ స్టాగ్స్ కొత్త సిద్ధాంతాన్ని కూడా రన్వీర్ చక్కగా చూపారు. “ఇది మన జీవితం. మనం దీనిని ఘనంగా జీవిస్తాము. వియ్ లివ్ ఇట్ లార్జ్.” ఈ ఫిల్మ్‌లో అంతర్జాతీయ క్రికెటింగ్ స్టార్స్, సూర్యకుమార్ యాదవ్, ఎబి డి విలియర్స్ కూడా కనిపిస్తారు.
ఈ కొత్త క్యాంపెయిన్‌తో బ్రాండ్, ట్రెండ్లను సృష్టించే, మార్గదర్శకులుగా ముందుకు సాగే జనరేషన్ లార్జ్ యొక్క గళంగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. సోషల్ కరెన్సీ మరియు ప్రత్యామ్నాయ పులకింపుల కోసం ఉర్రూతలూగే యువ ప్రేక్షకులతో తమ కనెక్ట్‌ను పెంపొందించుకునే దిశలో మరో అడుగు ముందుకు వేసేందుకు ఈ క్యాంపెయిన్, బ్రాండుకు సహకరిస్తుంది.
ఈ కొత్త క్యాంపెయిన్, బ్రాండు యొక్క ముఖ్యమైన మూడు సూత్రాలను చక్కగా మేళవిస్తుంది: జనరేషన్ లార్జ్ సిద్ధాంతం; లివ్ ఇట్ లార్జ్ సంకేతం, జనరేషన్ లార్జ్ యొక్క అసలైన క్రియ మరియు గోల్డెన్ స్టాగ్ బ్రాండ్ ఐకొనోగ్రఫీ. లివ్ ఇట్ లార్జ్ సంకేతం, జనరేషనన్ లార్జ్ ఏ విధంగా జీవితంలోని ప్రతి క్షణంలోకి చేరి, దానిని పూర్తి స్థాయిలో జీవించటానికి ప్రతిబింబం; ఇది నేటి డిజిటల్-నేటివ్ ప్రేక్షకులకు సహజమైన సంకేతం కూడా. టివి, డిజిటల్, ప్రింట్ మరియు ఓఓహెచ్ ల వ్యాప్తంగా అన్ని ప్రధానమైన వేదికల పై ప్రభావవంతమైన పద్ధతిలో ఈ క్యాంపెయిన్‌ను యాంప్లిఫై చేయటం జరుగుతుంది.
కొత్త బ్రాండ్ క్యాంపెయిన్ విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. కార్తీక్ మొహింద్ర, సిఎంఓ, పెర్నోడ్ రికార్డ్ ఇండియా, ఇలా అన్నారు “రాయల్ స్టాగ్ ఎల్లప్పుడూ, ఘనంగా జీవించటానికి స్ఫూర్తిని ఇచ్చే ఒక చారిత్రాత్మక బ్రాండ్‌గా నిలిచి ఉన్నది. మడమ తిప్పని నేటి తరపు స్ఫూర్తిని మా క్యాంపెయిన్ ఒడిసి పట్టుకున్నది, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది, జీవితపు అనుభవాలను మరింతగా ఎక్కువగా అందించాలని కోరుకుంటోంది. ఈ కొత్త క్యాంపెయిన్ ఒక విలక్షణమైన మరియు తాజాగా, శక్తి నిండి ఉండే నవ యవ్వనపు విజువల్ గుర్తింపును ఇస్తుంది, ఇంకా ప్రధానంగా జనరేషన్ లార్జ్ – ఈ తరపు నైతికవిలువలకు రూపాన్నిస్తుంది. మార్పు దిశలో బ్రాండ్ ప్రస్థానానికి ఇది ఇంకొంత వడిని అందించి, విభాగపు లీడర్ నుండి సాంస్కృతిక ఐకన్‌గా ఎదిగేందుకు దోహదం చేస్తుంది. పెర్నోడ్ రికార్డ్, ‘బిగ్గర్ (పెద్ద). బోల్డర్ (సాహసవంతం). బెటర్ (మెరుగు) ’ అనే సిద్ధాంతానికి నిలిచి ఉండటానికి ఇది మరింతగా ఊతమిస్తుంది. నిజంగా ఈ క్యాంపెయిన్‌లో, బ్రాండును కొత్త క్షితిజాలకు చేర్చి మరిన్ని సరిహద్దులను జయించేట్లు చేయగల అన్ని ఉన్నాయి.”
బ్రాండ్ అంబాసిడర్ సూపర్‌స్టార్ రన్వీర్ సింగ్ ఇలా అన్నారు. “రాయల్ స్టాగ్స్ కొత్త లివ్ ఇట్ లార్జ్ సిద్ధాంతాన్ని నేను మనసారా సమర్ధిస్తాను. ఇది నా జీవితపు సిద్ధాంతం కూడా. ప్రతి క్షణాన్ని ఒడిసిపట్టుకుని, దానికి మీరు ఇవ్వగలిగిన ఉత్తమమైనది అందించగలగటమే అసలు సూత్రం. రాయల్ స్టాగ్ వంటి ఐకానిక్ బ్రాండ్, సమయంతో పాటు ముందుకు సాగుతూ తన ప్రేక్షకులతో మరింత లోతుగా అనుబంధాన్ని పెంపొందించుకోగలగటం నిజంగా అద్భుతం. ఈ క్యాంపెయిన్ ఫిల్మ్ యవ్వనభరితంగా, శక్తివంతంగా, నా జీవితగమనానికి నిజమైన ప్రతిబింబంగా ఉన్నది.”