Sunday, September 22, 2024

రెండేళ్లలో ‘సంగమేశ్వర’ పూర్తి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో/మునిపల్లి: సంగమేశ్వర ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మునిపల్లి మండల పరిధిలోని చిన్నచెల్మెడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి బుధవారం మంత్రి భూమి పూజ చేశారు. అనంత రం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వాలు సింగూరు ప్రాజెక్టు నీటిని హైదరాబాద్‌కి తీసుకువెళ్లారని, ఈ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. సిఎం కె సిఆర్ గోదావరి నీళ్లని తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి సంగమేశ్వర ఎత్తిపోతల ప్రారంభించుకున్నామన్నారు. రూ.2653 కోట్లతో సంగమేశ్వర పథకం నిర్మాణం జరుగుతోందని, దీని ద్వారా 2.19 లక్షల ఎకరాలకు సాగు నీరు అందివ్వనున్నట్లు తెలిపారు. ఇక్కడి భూ ములన్నీ బంగారంగా మారుతాయన్నారు. వానపడ్డా, పడకపోయినా రెండు పంటలు పండే మా గానిగా ఈ ప్రాంతం మారబోతుందన్నారు.

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో సుమా రు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే కా ర్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. పైపు పెడితే పొయ్యి దగ్గరికి నీళ్లు వచ్చాయంటే ఇది కెసిఆర్, బిఆర్‌ఎస్ ఘనతేనన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఉ చిత కరెంటు ఇస్తలేరని, కెసిఆర్ వచ్చాక కరెంటు బాధలు లేవు, రైతు బంధు, రైతు బీమా, చెక్ ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల ని ర్మాణం తదితర కార్యక్రమాలతో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ప్రాజెక్టులతో జిల్లాలో ని భూములన్నీ సస్యశ్యామలమవుతాయని అన్నా రు. పండిన అన్ని పంటలను మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని, సింగూర్ ద్వారా సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుతున్నాయన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉ ద్యమ నేత చేతుల్లోంచి మరొకరి చేతుల్లోకిపోతే ఆగమవుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నాడు తండాలన్నింటినీ పంచాయతీలుగా మారుస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఆ పని చేయలేకపోయారన్నారు. కానీ, సిఎం కెసిఆర్ మాత్రం ప్రతి తండాను గ్రామ పంచాయతీగా మార్చారని గుర్తుచేశారు. సంగారెడ్డికి ప్రభుత్వ వైద్య కళాశాల ఇవ్వడంతో పాటు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఆస్పత్రులను కూడా అభివృద్ధ్ది చేశామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ ఇచ్చే బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మహిళలు ఆదరించాలన్నారు.

24 గంటల ఉచిత వి ద్యుత్ ఇవ్వడమే కాకుండా రైతు బంధు, రైతు బీ మా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతు పక్షపాతిగా సిఎం కెసిఆర్ నిలిచారన్నారు. వెనుక బడ్డ ప్రాంతాలు కాదని, వెనకపడేయబడిన ప్రాం తాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం తొమ్మిదేళ్లలో సిఎం కెసిఆర్ చేసి చూపించారన్నారు. బిఆర్‌ఎస్‌ను ఆదరించడం ద్వారా కెసిఆర్‌ను మరింత బలోపేతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. జడ్‌పి చైర్‌పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ శరత్, ఎంపి బిబి పాటిల్, ఎంఎల్‌సి రఘోత్తంరెడ్డి, ఎంఎల్‌ఎలు క్రాంతికిరణ్, మాణిక్‌రావు, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, ఎస్‌పి రమణకుమార్, డిసిఎంస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, జాగృతి రాష్ట్ర నాయకుడు మఠం భిక్షపతి, సాయికుమార్, మీనాక్షిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News